Saturday, February 4, 2017

పాకిస్తాన్ లో జరిగిన ముఖ్యమైన నియామకాలు

                 పాక్ ఆర్మీ కొత్త చీఫ్‌గా జావేద్ బాజ్వా

}పాకిస్తాన్ ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా నవంబర్ 26న నియమితులయ్యారు.

}నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్న జనరల్ రహీల్ షరీఫ్ స్థానంలో బాజ్వాను నియమించారు.

}కాంగోలో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్‌తో కలసి బ్రిగేడ్ కమాండర్‌గానూ విధులు నిర్వహించారు.

            ఐఎస్‌ఐ కొత్త చీఫ్ నవీద్ ముఖ్తార్

}పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్‌‌స) చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ నియమితులయ్యారు.

}లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్ స్థానంలో ఐఎస్‌ఐ చీఫ్‌గా నవీద్‌ను నియమించినట్టు పాక్ ఆర్మీ డిసెంబర్ 13న తెలిపింది.

1 comment: