Saturday, February 4, 2017

న్యూజిలాండ్, దక్షిణ కొరియా, ఇటలీ లలో జరిగిన రాజకీయ మార్పులు

  

భిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు

}దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. పార్క్ పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది.

}ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు.

}దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్.

ఇటలీ ప్రధాని రెంజీ రాజీనామా

}పార్లమెంటరీ సంస్కరణలతోపాటు కొన్ని ప్రాంతీయ అధికారాలను జాతీయ ప్రభుత్వానికి బదలాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణపై జరిగిన రెఫరెండంలో ఓడిపోవడంతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మేటూ రెంజీ ప్రకటించారు.

}డిసెంబర్ 4న జరిగిన రెఫరెండంలో దాదాపు 70 శాతం మంది ఓటు వేయంగా 59.5 శాతం మంది రెఫరెండంకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇటలీ ప్రధానిగా జెంటిలోని

}డెమోక్రటిక్ పార్టీ నేత పాలో జెంటిలోని నేతృత్వంలో డిసెంబర్ 11న ఇటలీలో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది.

}ప్రధాని పదవికి మేటూ రెంజి రాజీనామా చేయడంతో జెంటిలోని కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు

న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా

}న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ తన పదవికి డిసెంబర్ 5న రాజీనామా చేశారు.

}2002లో పార్లమెంటులో తొలిసారి అడుగు పెట్టిన జాన్‌కీ నాలుగేళ్ల తర్వాత నేషనల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.

}తర్వాత 2008లో లేబర్ పార్టీపై గెలుపొంది ప్రధాని అయ్యారు.

}న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్ ఇంగ్లిష్ డిసెంబర్ 12న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు.


No comments:

Post a Comment