Saturday, February 4, 2017

ఇస్రో చేపట్టిన ముఖ్యమైన ప్రయోగాలు

  

పీఎస్‌ఎల్‌వీ-సీ 36 ప్రయోగం విజయవంతం

}శ్రీ‌హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 7న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-36 ప్రయోగం విజయవంతమైంది.

}ఈ రాకెట్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్‌శాట్-2ఏను కక్ష్యలోకి పంపారు. మన దేశం ప్రయోగించిన రిసోర్స్ శాట్ ఉపగ్రహాల్లో ఇది మూడోది.

}రిసోర్స్ శాట్-2 జీవిత కాలం ముగుస్తుండటంతో దాని స్థానంలో 1235 కిలోల బరువు గల రిసోర్స్ శాట్-2ఏను ప్రవేశపెట్టారు.

}ఈ ఉపగ్రహం పంటల విస్తీర్ణం, దిగుబడులు, తెగుళ్లు, కరువు ప్రభావాలపై సమాచారం అందిస్తుంది.

}జల వనరులు, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాలకు కూడా తోడ్పడుతుంది.

}ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 38వ ప్రయోగం.

జీశాట్-18 ప్రయోగం విజయవంతం

}సమాచార సేవలకు ఉద్దేశించిన ఉపగ్రహం జీశాట్-18ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించింది.

}అక్టోబర్ 6న ఫ్రెంచ్ గయానాలోని (దక్షిణ అమెరికా) కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ ఉపగ్రహం ద్వారా రానున్న రోజుల్లో టీవీ, టెలికమ్యూనికేషన్స్, వీశాట్, డిజిటల్ ఉపగ్రహ వార్తా సేకరణ వంటి అంశాలు వేగవంతం కానున్నాయి.

}జీశాట్-18 విశేషాలు

రాకెట్: ఏరియాన్ 5 ఈసీఏ, వీఏ231

మొత్తం బరువు: 3404 కేజీలు

జీవితకాలం: 15 సంవత్సరాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ 35(PSLV-C35) ప్రయోగం విజయవంతం

}పీఎస్‌ఎల్‌వీ సీ-35 ద్వారా ఒకే ప్రయోగంలో 8 ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రికార్డు సృష్టించింది.

}దీంతో ప్రపంచంలో అమెరికా, రష్యాల తర్వాత ఆ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా అవతరించింది.

}శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సెప్టెంబర్ 6న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ35 వాహకనౌక స్వదేశీ ఉపగ్రహాలైన స్కాట్‌శాట్-1, ప్రథమ్, పైశాట్ తో పాటు ఐదు విదేశీ ఉపగ్రహాలను (మొత్తం 8) రెండు వేర్వేరు ఎత్తుల్లోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఉపగ్రహాల వివరాలు

స్కాట్‌శాట్-1:371 కిలోలు బరువుండే స్కాట్‌శాట్-1 ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. 

భారత వర్సిటీల ఉపగ్రహాలు: 2 (ప్రథమ్‌శాట్-ముంబై ఐఐటీ, పైశాట్-బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయం

అల్జీరియా ఉపగ్రహాలు: 3 (అల్‌శాట్-1బి, అల్‌శాట్-2బి, అల్‌శాట్-1ఎన్)

అమెరికా ఉపగ్రహం: 1 (పాత్‌ఫైండర్-1)

కెనడా ఉపగ్రహం: 1 (ఎన్‌ఎల్‌ఎస్-19)

ఇన్‌శాట్-3డీఆర్(INSAT-3DR) ప్రయోగం విజయవంతం

}నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 8న వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్‌ను ఇస్రో విజయవంతంగా పయోగించింది.

}దీని కోసం దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05(GSLV-F05) ను ఉపయోగించారు.

}ఇది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఇన్‌శాట్-3డీఆర్ పనిచేయని ఇన్‌శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది


No comments:

Post a Comment