Saturday, February 4, 2017

నల్లధనం వెల్లడకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు

            

 ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన పథకం ప్రారంభం

}పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో జమవుతున్న నల్లధనాన్ని (ఆదాయ వివరాలు వెల్లడించనిది) సమర్థంగా వినియోగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన (పీఎం జీకేవై)-2016 పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది.

}దీని కింద ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 50% పన్ను విధిస్తారు.

}మిగిలిన దానిలో 25 శాతంను తప్పనిసరిగా పీఎంజీకేవై(PMGKY) లో జమ చేయాలి.

}దీనిపై నాలుగేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఎలాంటి వడ్డీ కూడా ఉండదు.

}మిగిలిన 25 శాతంను వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.

}ఈ మేరకు నవంబర్ 28న ఆదాయ పన్ను(ఐటీ) చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు.

}ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చిస్తారు.

}పీఎంజీకేవైను ఫైనాన్స్ చట్టం-2016లో చాప్టర్ 9 కింద చేర్చారు.

 ఐడీఎస్ కింద 65 వేల కోట్ల నల్లధనం వెల్లడి

}నల్లధనాన్ని వెలికి తీయడానికి మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆదాయ వెల్లడి పథకం (Income Declaration Scheme) లో భాగంగా దేశవ్యాప్తంగా రూ.65,250 కోట్ల నల్లధనం బహిర్గతమైంది.

}మొత్తం 64,275 మంది తమ అక్రమాదాయాన్ని బయటపెట్టారు. దీనిలో పన్నుల రూపంలో రూ. 29,362 కోట్లు ప్రభుత్వానికి సమకూరనుంది.

}ఇందులో రూ.14,700 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూరనున్నాయి.

} పన్ను చెల్లించని ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది.

}వెల్లడించిన అదాయం ప్రకారం దాదాపు రూ. 13 వేల కోట్లతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ముంబై(రూ. 8,500 కోట్లు), ఢిల్లీ(రూ. 6 వేల కోట్లు), కోల్‌కతా(రూ. 4 వేల కోట్లు) ఉన్నాయి. 

}2016 జూన్ 1న ఐడీఎస్‌ను తీసుకొచ్చారు.

}ఈ పథకం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 45 శాతం పన్ను, పెనాల్టీ చెల్లించే వీలు కల్పించింది.

}విదేశాల్లో దాచిన భారతీయుల నల్లధనానికి సంబంధించి 2015లో ప్రకటించిన ఇదే తరహ పథకం ద్వారా రూ. 2,428 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కేవలం 644 మందే దీనికి స్పందించారు. 

ఐటీ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

}ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించేందుకు ఉద్దేశించిన ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు 2016ను నవంబర్ 29న లోక్‌సభ ఆమోదించింది.

}రద్దయిన రూ. వెయ్యి, రూ. 500 నోట్లను చట్టవిరుద్ధంగా మార్చే వారిని కట్టడి చేయడానికి ఈ బిల్లును ప్రతిపాదించారు.

}దీని ప్రకారం రద్దయిన కరెన్సీని అక్రమంగా మార్చే వారిపై 60% పన్ను, పెనాల్టీలతో కలిపి గరిష్టంగా 85% వసూలు చేస్తారు.

}స్వయంగా నల్లధనం వివరాలు సమర్పిస్తే 50% పన్ను విధించి 25% నగదును వెంటనే తీసుకునే వెసులుబాటు కల్పిండంతో పాటు, మిగతా 25% నాలుగేళ్ల అనంతరం తీసుకునేలా ప్రతిపాదనలు చేర్చారు.



No comments:

Post a Comment