Saturday, February 4, 2017

ఇతర దేశాలతో జరిగిన ముఖ్యమైన ఒప్పందాలు

 

ఇండోనేసియా అధ్యక్షుడి భారత్ పర్యటన

}ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేపట్టాలని, రక్షణ, భద్రత సహా పలు కీలక రంగాల్లో పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఇండోనేసియా నిర్ణయిచాయి.

}ఈ మేరకు డిసెంబర్ 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడో సమావేశమయ్యారు.

}ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య క్రీడలు, యువజన సర్వీసుల్లో పరస్పర సహకారం, ప్రామాణీకరణకు సంబంధించి రెండు ఒప్పందాలు కుదిరాయి.

భారత్, వియత్నాం మధ్య కుదిరిన అణు ఒప్పందం

}వియత్నాం జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు ఎన్‌గాయోన్ దచిన్‌గాన్ భారత్‌పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో డిసెంబర్ 9న పౌర అణు సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.

}దీంతోపాటు వైమానిక సంబంధాల్ని పెంచుకోవడం, ఇంధన రంగంలో ఉమ్మడి కృషి, పార్లమెంటరీ సహకారానికి సంబంధించి మరో మూడు ఇతర ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి.

}ఈ కార్యక్రమంలో భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాల్గొన్నారు.

భారత్-కిర్గిజిస్థాన్ మధ్య ఆరు ఒప్పందాలు

}కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు ఆల్మాజ్‌బెక్ అతంబయేవ్ భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 20న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.

}ఈ సందర్భంగా రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమలుకు విస్తృత ప్రాతిపదికను ఖరారు చేశాయి.

}తీవ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడతామనే కృతనిశ్చయాన్ని ప్రకటించాయి.

}దీంతోపాటు ఇరు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో వ్యవసాయం, పర్యాటక రంగం, సాంస్కృతిక, ప్రసార, యువజన వ్యవహారాల్లో సహకారానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందాలు ఉన్నాయి

సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్‌తో భారత్ ఒప్పందం

}స్విట్జర్లాండ్‌లో 2018 సెప్టెంబర్ తర్వాత జరిగే భారతీయుల బ్యాంకు లావాదేవీల వివరాలను పొందేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది.

}ఒప్పందం మేరకు 2018 సెప్టెంబర్ నుంచి ‘ఆటోమేటిక్ షేరింగ్’ కింద భారతీయుల ఖాతాల సమాచారాన్ని మనదేశం పొందుతుంది.

}ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని పంచుకొనే ‘సంయుక్త ప్రకటన’ ఒప్పందంపై సీబీడీటీ చైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోడిట్ నవంబర్ 22న సంతకాలు చేశారు.

పౌర అణు ఒప్పందంపై భారత్-జపాన్ సంతకాలు

}ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా నవంబర్ 11న ఆ దేశ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు.

}ఈ సందర్భంగా టోక్యోలో చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

}దీంతో జపాన్ తన అణు సాంకేతికతను, రియాక్టర్లను భారత్‌కు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైంది.

}దాదాపు ఆరేళ్ల పాటు జరిపిన అనేక చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.

}ఇరు దేశాల మధ్య అణు ఒప్పందంతోపాటు మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచడం, రైల్వేలు, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాడానికి ఉద్దేశించిన మరో తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి.

}అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై భారత్ సంతకం చేయకపోయినా జపాన్ ఈ ఒప్పందం చేసుకుంది.

}అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, మంగోలియా, ఫ్రాన్‌‌స, నమీబియా, అర్జెంటీనా, కెనడా, కజకిస్తాన్, ఆస్ట్రేలియాలతో ఇప్పటికే భారత్ అణు ఒప్పందాలు చేసుకుంది.

న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ భారత పర్యటన

}న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో అక్టోబర్ 26న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

}ఈ సందర్భంగా జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో సైబర్ సెక్యూరిటీ, డబుల్ ట్యాక్సేషన్, పన్ను ఎగవేతకు సంబంధించిన మూడు ఒప్పందాలు కుదిరాయి.

}అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వంకు న్యూజిలాండ్ నిర్మాణాత్మక తోడ్పాటు అందిస్తుందని జాన్ కీ హామీ ఇచ్చారు

సింగపూర్ ప్రదాని భారత పర్యటన

}సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో అక్టోబర్ 4న ఢిల్లీలో సమావేశమయ్యారు.

}ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా మూడు ఒప్పందాలు కుదిరాయి.

}ఇందులో వాణిజ్యానికి ఊతమిచ్చే మేధో హక్కుల ఒప్పందం, ఈశాన్య రాష్ట్రాల కోసం గువాహటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, రాజస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఉదయ్‌పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టూరిజమ్ ట్రైనింగ్ ఏర్పాటు వంటి అంశాలున్నాయి.

రష్యాతో భారత్ 16 ఒప్పందాలు

}భారత్ రష్యాల మధ్య రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా మొత్తం 16 ఒప్పందాలు కుదిరాయి.

}బ్రిక్స్ సమావేశాల సందర్భంగా గోవా వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 15న సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

}రూ.33,350 కోట్ల విలువైన ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, ఇది 400 కి.మీ. పరిధి వరకూ దూసుకెళ్లగల క్షిపణులు, డ్రోన్లు, రహస్య విమానాలతో సహా శత్రు విమానాలనూ ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది.

}అడ్మిరల్ గ్రిగోరోవిచ్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందం, దీని కింద రెండు నౌకలను రష్యా భారత్‌కు అందిస్తుంది. మరో రెండింటిని రష్యా సాయంతో భారత్‌లోనే నిర్మిస్తారు.

}కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం కింద రూ. 6,672 కోట్లతో 200 కమోవ్ 226టి హెలికాప్టర్లను రష్యా, భారత్‌లు కలసి భారత్‌లోనే తయారు చేస్తాయి. 

భారత్-వియత్నాం మధ్య 12 ఒప్పందాలు

}భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటనలో సెప్టెంబర్ 3న ఆ దేశ ప్రధాని గుయేన్ ఫుక్‌తో సమావేశమయ్యారు.

}ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ, ఐటీ, అంతరిక్షం, సైబర్ భద్రత, సముద్ర గస్తీ బోట్ల నిర్మాణం వంటి 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు.

}రక్షణ రంగాన్ని మెరుగుపరచుకునేందుకు వియత్నాంకు భారత్ రూ.3,400 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

}ఆ దేశంలో సాఫ్ట్వేర్ పార్క్ ఏర్పాటు కోసం ప్రధాని రూ.34 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’

}భారత్-ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

}ఆస్ట్రేలియాలోని ఆరు నగరాల్లో పది వారాల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో భారత్, ఆస్ట్రేలియా దేశాల నృత్య, సంగీత, క్రీడలను ప్రదర్శిస్తారు.

}ఈ ఉత్సవాలు అడిలైడ్, అలైస్ స్పింగ్‌‌స, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ నగరాల్లో జరగనున్నాయి.

భారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు

}ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ భారత పర్యటనలో భాగంగా జూన్ 30న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.

}కిమ్ పర్యటనలో సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత్‌కు ప్రపంచ బ్యాంక్ దాదాపు రూ.6,750 కోట్ల సాయం అందించనుంది.

}భారత్ 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.



No comments:

Post a Comment