Saturday, February 4, 2017

ఫోర్బెస్ మ్యాగజీన్ ముఖ్యమైన వ్యక్తులు

  

ఫోర్బ్స్ టాప్-10లో మోదీ

}ఫోర్బ్స్ మేగజీన్ 74 మందితో వెలువరించిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా’ లో ప్రధాని మోదీ తొమ్మిదోస్థానంలో నిలిచారు.

}రష్యా అధ్యక్షుడు పుతిన్ వరసగా నాలుగో ఏడాదీ తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.

}ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 38వ, ఉత్తర కొరియా నేత కిమ్ 43వ, ఒబామా 48వ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 51వ, ఐసిస్ ఉగ్రనేత అబుబకర్ 57వ ర్యాంక్ పొందారు.

టాప్-10 శక్తివంతుల జాబితా

1 వ్లాదిమిర్ పుతిన్

2 డోనాల్డ్ ట్రంప్

3 ఏంజెలా మెర్కెల్

4 జీ జిన్‌పింగ్

5 పోప్ ఫ్రాన్సిస్

6 జానెట్ యెలెన్

7 బిల్‌గేట్స్

8 లారీపేజ్

9 నరేంద్ర మోదీ

10 మార్క్ జుకర్‌బర్గ్

ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో షారుక్, అక్షయ్

}ప్రపంచంలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల టాప్-10 జాబితాలో (2016కు) బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది.

}ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో షారుక్ ఖాన్ రూ. 221 కోట్లతో ఎనిమిదో స్థానంలో, అక్షయ్ కుమార్ రూ. 211 కోట్ల ఆదాయంతో పదో స్థానంలో (బ్రాడ్ పిట్‌తో కలిసి) ఉన్నారు.

}హీరో సల్మాన్ ఖాన్ రూ. 191కోట్ల ఆదాయంతో 14వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 134 కోట్ల రూపాయలతో 18వ స్థానంలో ఉన్నారు



No comments:

Post a Comment