Saturday, February 4, 2017

విశాఖపట్నం లో జరిగిన IFR-2016


}11వ అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - ఐఎఫ్‌ఆర్) ఫిబ్రవరి 4న విశాఖపట్నంలో ప్రారంభమైంది.

}ఈ ఐఎఫ్‌ఆర్‌ను తొలిసారిగా దేశ తూర్పు తీరంలో నిర్వహించారు.

}ఈ కార్యక్రమంలో 51 దేశాలు పాలుపంచుకున్నాయి.

}త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 6న యుద్ధనౌకల సమీక్ష నిర్వహించారు.

}ఐఎన్‌ఎస్ సుమిత్రలో ఆయన నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ప్రదర్శనలో ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, విక్రమాదిత్య, విరాట్, శివాలిక్, మైసూర్ మొదలైన యుద్ధనౌకలతో పాటు సింధురాజ్, సింధుకారి, సింధువీర్ జలాంతర్గాములు కూడా పాల్గొన్నాయి.

}భారత్‌కు చెందిన 65 యుద్ధనౌకలతో పాటు 24 దేశాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి

}ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ‘సముద్ర జలాలపై శాంతి, సుస్థిరత తీరప్రాంత దేశాల సమష్టి బాధ్యత’ అని పేర్కొన్నారు.


No comments:

Post a Comment