Saturday, February 4, 2017

జయలలిత మృతి


}జయలలిత (జ.ఫిబ్రవరి 24, 1948-- మ.డిసెంబరు 5, 2016) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు తమిళనాడు రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది.

}అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది.

}రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది.

}ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.

}ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది.

}జయలలిత అసలు పేరు కోమలవల్లి.

}జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 

}1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది.

}ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది.

}అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.

}1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది.

}ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.

No comments:

Post a Comment