Saturday, February 4, 2017

ఇతర దేశాలతో జరిగిన రక్షణ రంగ ఒప్పందాలు

                   

భారత్-ఫ్రాన్స్ మధ్య ‘రఫెల్’ ఒప్పందం

}గగనతలం నుంచి గగనతలం, భూ ఉపరితలంపై లక్ష్యాల్ని ఛేదించే క్షిపణులతో పాటు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు కలిగిన 36 రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

}ఈ మేరకు రూ.59 వేల కోట్ల విలువైన ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు మనోహర్ పరీకర్, జీన్ ఇవెస్ లెడ్రియన్‌లు సెప్టెంబర్ 23న సంతకాలు చేశారు.

}దీని ప్రకారం 36 నెలల్లో తొలి విమానాన్ని, 67 నెలల్లోపు మొత్తం విమానాల్ని అందచేయాలి.

}రూ.25,588 కోట్లు విమానాల కొనుగోలుకు కాగా మిగిలిన మొత్తం భారత్ సూచించిన మార్పులు, విమానాల నిర్వహణకు అవుతుంది

శతుఘ్నల కొనుగోలుకు అమెరికాతో ఒప్పందం

Øఎం777 రకానికి చెందిన 145 శతుఘ్నల (howitzer guns) కొనుగోలుకు సంబంధించి భారత్, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. 

}వీటి విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. 1980ల్లో జరిగిన బొఫోర్స్ కుంభకోణం తర్వాత ఫిరంగుల కొనుగోలుకు సంబంధించి కుదిరిన తొలి    ఒప్పందం ఇది. 

విమానాల కొనుగోలుకు భారీ ఒప్పందం

}రక్షణరంగ నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పర్చేలా బిలియన్ డాలర్ల వ్యయంతో (దాదాపు రూ.6,700 కోట్లు) నాలుగు నిఘా విమానాలు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది.

}దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థ కలిగిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాలు ‘పోసిడాన్-8’లను కొనేందుకు భారత్.. అమెరికా రక్షణశాఖ, బోయింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది.

అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా భారత్

}భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది.

}రక్షణ రంగ వాణిజ్యం, సాంకేతికత బదిలీ విషయంలో అమెరికా అతి సన్నిహిత మిత్రులతో సమానంగా భారత్‌నూ పరిగణిస్తుంది.

}భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య జూన్ 7న జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

}అధీకృత నౌకాశ్రయ సందర్శనలు, సంయుక్త విన్యాసాలు, శిక్షణ, విపత్తు సహాయం కార్యక్రమాల్లో పరస్పరం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు లాజిస్టిక్స్ ఎక్సేంజ్ అవగాహన ఒప్పందాన్నీ ఇరు దేశాలూ ఖరారు చేశాయి. 



No comments:

Post a Comment