Saturday, February 4, 2017

కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన వివిధ రకాల ఆర్డినెన్సులు

 

ఓబీసీల్లోకి 15 కొత్త కులాల చేరికకు కేంద్రం ఆమోదం

}ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) కేంద్ర జాబితాలో మార్పుచేర్పులకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న ఆమోదం తెలిపింది.

}ఇందులో కొత్తగా 15 కులాలను చేర్చడంతోపాటు మరో 13 ఇతర కులాల్లో ప్రతిపాదించిన మార్పులకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలియజేసింది.

ఎయిడ్స్’ రోగులపై వివక్షకు రెండేళ్ల జైలు

}హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది.

}ఈ మేరకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

}ఈ బిల్లు అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా యాంటీ   రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని ఏర్పాటు చేయాలి.

బాంబే, మద్రాసు హైకోర్టుల పేర్ల మార్పు

}బాంబే, మద్రాసు హైకోర్టుల పేర్ల మార్పునకు సంబంధించి న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 5న ఆమోదం తెలిపింది.

}దీంతో ఇకపై బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలవనున్నారు.

}కలకత్తా హైకోర్టును కూడా కోల్‌కతా హైకోర్టుగా మార్చనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

పారిస్ ఒప్పందాన్ని ధ్రువీకరించిన భారత్

}పారిస్ ఒప్పందాన్ని భారత్ అక్టోబర్ 2న ధ్రువీకరించింది.

}ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన పత్రాన్ని ఐరాసలోని భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్యసమితి ఒప్పందాల విభాగాధిపతి శాంటియాగో విల్లాల్పండోకు అందించారు.

మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

}భారీ ఓడరేవు అధికారాల (మేజర్ పోర్ట్ అథారిటీస్) బిల్లు- 2016కు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 14న ఆమోదం తెలిపింది.

}నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పించడం ద్వారా ఓడరేవుల నిర్వహణ నైపుణ్యం, సామర్థ్యాలను పెంచేందుకు తాజా బిల్లు ఉపయోగపడనుంది.

}నౌకాయాన శాఖ చేసిన ప్రతిపాదన మేరకు కేంద్రం ప్రధాన ఓడరేవు ధర్మకర్తల మండళ్ల చట్టం-1963 స్థానంలో తాజా బిల్లును తెచ్చింది

మోటారు సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

}మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు కేంద్ర కేబినెట్ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది.

}18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.

}ఈ బిల్లు ప్రకారం అర్హత లేకుండా వాహనం నడిపితే కనీసం రూ.10 వేల జరిమానా చెల్లించాలి.

}ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.5000, తాగి వాహనం నడిపితే రూ.10 వేలు, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. హిట్ అండ్ రన్ కేసుల్లో రూ.2 లక్షల జరిమానాతోపాటు ప్రమాద మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది

మోడల్ షాప్ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

}దేశంలో 24 గంటలు, 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచేలా ‘ద మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఉద్యోగం, సేవల వసతి నియంత్రణ) చట్టం-2016’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

}దీని ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న దుకాణాలు, కంపెనీలు (తయారీ సంస్థలు తప్ప) ఏడాదిపాటు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు.

}ఎప్పుడు కావాలంటే అప్పుడు దుకాణాలు తెరుచుకోవచ్చు.

}దీంతో పాటు సరైన భద్రత కల్పించటం ద్వారా రాత్రి షిఫ్టులో మహిళలను పనిలో పెట్టుకోవచ్చు.

}ఇవన్నీ చేయాలంటే ఉద్యోగులందరికీ సరైన తాగునీరు, క్యాంటీన్, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక చికిత్సతోపాటు మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

}కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు. ఇది నేరుగా అమల్లోకి వస్తుంది



No comments:

Post a Comment