Saturday, February 4, 2017

వివిధ రకాల బ్రిక్స్ సమావేశాలు

  

న్యూఢిల్లీలో బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం

}క్షయ, హెచ్‌ఐవీ, మలేరియా లాంటి జబ్బులను ఎదుర్కొనేందుకు పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్ దేశాలు) నిర్ణయించాయి.

}ఈ మేరకు న్యూఢిల్లీలో డిసెంబర్ 16న ముగిసిన ఆరో బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించింది

వ్యవసాయ ఎగుమతుల రాయితీలను ఎత్తేసిన బ్రిక్స్

}న్యూఢిల్లీలో సెప్టెంబర్ 23న జరిగిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం వ్యవసాయ ఎగుమతుల రాయితీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

} 2015, డిసెంబర్‌లో నైరోబిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మంత్రుల స్థాయి సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు, ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిక్స్ దేశాల వ్యవసాయ మంత్రులు ఉమ్మడి ప్రకటన చేశారు.

బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు

}జైపూర్‌లో రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఆగస్టు 21న ముగిసింది.

}లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

}సదస్సు ముగింపులో ఆమోదించిన జైపూర్ డిక్లరేషన్.. ఆర్థిక వృద్ధి, సామాజిక సమ్మిళితం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాల పటిష్టతకు మహిళా పార్లమెంటేరియన్లు ప్రతినబూనాలని పేర్కొంది.

బ్రిక్స్-బిమ్స్టెటెక్ సదస్సు

}అక్టోబర్ 16న గోవాలో జరిగిన బ్రిక్స్-బిమ్స్ టెక్(బంగాళాఖాత దేశాల సాంకేతిక, ఆర్థిక సహకార వేదిక) సదస్సులో సభ్యదేశాలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.

}ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాధినేతలతో పాటు షేక్ హసీనా (బంగ్లాదేశ్), మైత్రిపాల సిరిసేన (శ్రీలంక), ప్రచండ (నేపాల్), ఆంగ్‌సాన్ సూచీ (మయన్మార్), సెరింగ్ తోబ్గే (భూటాన్), థాయ్‌లాండ్ విదేశాంగ సహాయ మంత్రి పాల్గొన్నారు.

బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం

}ద క్షిణ గోవాలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 16న ముగిసింది.

}ఈ సమావేశంలో హరిత సంబంధిత అంశాలపై పరస్పర సహకారానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

విశాఖలో పట్టణీకరణపై బిక్స్ సదస్సు

}విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది.

}ఈ సదస్సులో పట్టణీకరణ ఆవశ్యతక, దాని వల్ల తలెత్తే సమస్యలపై ప్రధానంగా చర్చించారు.

}సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 2011 నాటికి 32 శాతం ఉన్న పట్టణీకరణ 2050 నాటికి 70 శాతానికి పెరుగుతుందని చెప్పారు.

}దేశంలో 2011లో పట్టణ జనాభా 377 మిలియన్లు కాగా రానున్న 15 ఏళ్లలో 600 మిలియన్లకు చేరుతుందని తెలిపారు.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు బ్రిక్స్ దేశాల పిలుపు

}ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి త్వరితంగా ఆమోదం తెలపాలని బ్రిక్స్ దేశాల సదస్సు కోరింది.

}గోవాలో జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు.. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ అక్టోబర్ 16 ప్రకటన (గోవా డిక్లరేషన్) విడుదల చేశాయి.

}ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతోపాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు పేర్కొంది. 



No comments:

Post a Comment