Saturday, February 4, 2017

పార్లమెంటులో ఆమోదం పొందిన వివిధ బిల్లులు

 

దివ్యాంగుల హక్కుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

}దివ్యాంగులకు భద్రత కల్పించి వారి హక్కులను కాపాడటానికి ఉద్దేశించిన దివ్యాంగుల హక్కుల బిల్లు-2014ను రాజ్యసభ డిసెంబర్ 14న ఆమోదించింది.

}బిల్లు ప్రకారం దివ్యాంగులుగా గుర్తించేందుకు ఉండాల్సిన వైకల్యాల జాబితాను 7 నుంచి 21కి పెంచారు.

}అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచారు.

}దివ్యాంగులపై వివక్ష పాటిస్తే 6 నెలల నుంచి రెండేళ్ల దాకా జైలుశిక్షతో పాటు రూ. 10 వేల నుంచి 5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు.

ప్రసూతి ప్రయోజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం

}ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదించింది.

}ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం కూడా పొందింది. ఈ బిల్లు చట్టమైతే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న 18 లక్షల మంది ఉద్యోగినులకు ప్రయోజనం చేకూరుతుంది.

}ప్రపంచంలో నార్వే, కెనడాలు అత్యధికంగా 44 వారాల పాటు ప్రసూతి సెలవులను కల్పిస్తున్నాయి.

}ప్రస్తుత బిల్లుతో భారత్ అత్యధిక ప్రసూతి సెలవులు కల్పించే దేశాల వరుసలో మూడో స్థానంలో నిలుస్తుంది.

}ఈ బిల్లు ప్రకారం 26 వారాలకు పూర్తి జీతంతో కూడిన సెలవును, కనీసం 10 మంది ఉద్యోగులున్న అన్ని సంస్థలూ మంజూరు చేయాల్సి ఉంటుంది.

బాలలను పనిలో పెట్టుకుంటే 2 ఏళ్ల జైలు

}14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలలను పనిలో పెట్టుకునేవారికి రెండేళ్ల జైలు శిక్ష విధించేలా తీసుకొచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

}బాల కార్మికుల (నిషేధ, నియంత్రణ) సవరణ బిల్లుకు రాజ్యసభ గతంలోనే ఆమోదం తెలపగా, జూలై 26న లోక్‌సభ కూడా ఆమోద ముద్ర వేసింది.

}దీంతో గతంలో ఆరు నెలలున్న జైలు శిక్ష రెండేళ్లకు, రూ.10 వేల జరిమానా రూ. 20 వేలకు, రూ.20 వేల జరిమానా రూ. 50 వేలకు పెరగనుంది.

అమల్లోకొచ్చిన బినామీ లావాదేవీల సవరణ చట్టం

}నల్లధనం కట్టడిలో భాగంగా బినామీ లావాదేవీలను నిషేధించడానికి ఉద్దేశించిన బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం-2016 అమల్లోకి వచ్చింది.

}1988 బినామీ లావాదేవీల నిషేధిత చట్టంకు సవరణలు చేసి దీనిని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఆదాయానికి మించిన, లెక్క చెప్పలేని ఆస్తులు జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

}ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు మార్కెట్ విలువ ప్రకారం బినామీ ఆస్తి విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు.

}బినామీ లావాదేవీలపై తప్పుడు సమాచారమిస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు ఆస్తి విలువలో 10 శాతం జరిమానా విధించవచ్చు. 

రుణ వసూలు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

}రుణ గ్రహీతలు తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత సమయంలో చెల్లించని పక్షంలో వారు తాకట్టుపెట్టిన ఆస్తులను జప్తు చేసుకునే అధికారాన్ని బ్యాంకులకు కల్పించే చట్టానికి లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది.

}అయితే ఈ బిల్లు నుంచి వ్యవసాయ భూమికి మినహాయింపునిచ్చారు.

}ఎన్‌ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రికవరీ ఆఫ్ డెట్ లాస్ అండ్ మిస్లేనియస్ ప్రావిజన్స్(సవరణలు) బిల్లు-2016’ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

}సర్‌ఫాసీ, డీఆర్టీ, స్టాంపు చట్టం, డిపాజిటరీ చట్టాలకు సవరణలు చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

}రుణదాతలు డీఫాల్టర్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారమిస్తూ.. జిల్లా మెజిస్ట్రేట్ ఈ వ్యవహారాన్ని 30 రోజుల్లో పూర్తి చేసేలా సవరణ తెచ్చారు.



No comments:

Post a Comment