Saturday, February 4, 2017

క్యూబా లో ఫిడెల్ క్యాస్ట్రో మృతి


}క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 26న మృతి చెందారు.

}కొన్ని ఆరోగ్య సమస్యసలతో 2008లో అధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకి అప్పగించారు.

}1926 ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన క్యాస్ట్రో.. 1953లో శాంటియాగోలోని మొన్కాడా మిలటరీ బ్యారక్‌లపై మొదటిసారి దాడి చేసి జైలుకెళ్లాడు.

}15 సంవత్సరాలు శిక్ష పడగా క్షమాభిక్షపై 19 నెలలకే బయటకు వచ్చి 1959 జనవరి 8న క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టాపై తిరుగుబాటు చేసి క్యూబాను హస్త్తగతం చేసుకున్నారు.

}1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.

}ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో క్యూబన్ల జీవితాల గురించి 1960లో 269 నిమిషాలసేపు క్యాస్ట్రో చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది.

No comments:

Post a Comment