Saturday, February 4, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమైన పథకాలు

  

జన్మభూమి కమిటీలకు గ్రామసభల నిర్వహణ అధికారం

}ఆంధ్రప్రదేశ్‌లో గ్రామసభల నిర్వహణ అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

}ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 21న జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఆదేశించారు.

}గ్రామసభ అంటే?
గ్రామంలోని ఓటర్లు ప్రతి ఏటా విధిగా నాలుగు సార్లు సమావేశం కావాలి. దీన్నే గ్రామసభ అంటారు.

}సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలి.

}1994 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం గ్రామసభలకు స్థానిక సర్పంచ్ అధ్యక్షత వహించాలి.

}సర్పంచ్ లేకపోతే ఉపసర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించాలి.

ఏపీలో ‘పురసేవ’ యాప్ ఆవిష్కరణ

}పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా ‘పురసేవ’ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవంబర్ 30న ఆవిష్కరించారు.

}ప్రజలెవరైనా ఈ యాప్ ద్వారా తమ ప్రాంతంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. దీంతో అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారు.

ఇంధన పొదుపులో ఏపీ నెంబర్ 1

}ఇంధన పొదుపు అమలులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర ఉన్నాయి.

}ఈ మేరకు ఇంధన పొదుపుపై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన ర్యాంకుల నివేదికను నవంబర్ 4న ప్రకటించారు.

}గృహ వినియోగదారులకు ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయడం, వీధి దీపాలను ఎల్‌ఈడీ దీపాలతో మార్చడం, స్టార్ రేటెడ్ ఫ్యాన్ల పంపిణీ వంటి కార్యక్రమాల వల్ల 650 మెగావాట్ల ఇంధన పొదుపు జరిగి ఏపీలో రెండేళ్ళలో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని నివేదిక పేర్కొంది.

చంద్రన్న బీమా యోజన ప్రారంభం

}ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో అక్టోబరు 2న ప్రారంభించారు.

}15 నుంచి 70 ఏళ్ల లోపు వారు దీనికి అర్హులు.

}బీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా, పూర్తిగా వికలాంగుడైనా వెంటనే రూ.7 వేలు, మూడు వారాల్లోగా రూ.ఐదు లక్షలు కుటుంబానికి అందిస్తారు.

}ఇందుకోసం 155214 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు

ఏపీ పర్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

}ప్రజలను డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, వారిని నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు వీలుగా ఏపీ పర్సును ఏపీ సీఎం చంద్రబాబు డిసెంబర్ 6న ప్రారంభించారు. 

}ఏపీ పర్సు మొబైల్ యాప్‌లో 13 మొబైల్ బ్యాంకింగ్, 10 ఈ-వ్యాలెట్ సంస్థలు తమ యాప్‌లను పొందుపర్చాయి.




No comments:

Post a Comment