Saturday, February 4, 2017

ఇతర దేశాలతో చేసిన రక్షణ రంగ విన్యాసాలు

  

సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన భారత్-శ్రీలంక

}మిత్ర శక్తి-2016’ పేరుతో భారత్-శ్రీలంకలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలు నవంబర్ 6న ముగిశాయి.

}నాలుగో ద్వైపాక్షిక విన్యాసాల్లో భాగంగా శ్రీలంకలోని అంబెపూస వేదికగా 14 రోజుల పాటు వీటిని నిర్వహించారు.

}ఇందులో భారత సైన్యానికి చెందిన రాజ్‌పుతనా రైఫిల్స్ రెజిమెంట్, శ్రీలంక సైన్యానికి చెందిన సిన్హా రెజిమెంట్‌లు పాల్గొన్నాయి.

}ఈ విన్యాసాల్లో ప్రధానంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశాలకు లోబడి ఉగ్రవాద నిరోధక చర్యలపై కలిసి పనిచేయడంపై దృష్టిసారించారు.

}రెండు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహన, అనుభవాలను పంచుకోవడం, పరస్పర నమ్మకం, అవగాహనను పటిష్టం చేసుకోవడానికి ఈ విన్యాసాలు ఎంతగానో తోడ్పడతాయి.

}ఇదే తరహా విన్యాసాలను గతేడాది సెప్టెంబర్‌లో పుణెలో నిర్వహించాయి.

విశాఖలో సిమ్‌బెక్స్-16 ప్రారంభం

}విశాఖపట్నంలో భారత్- సింగపూర్ దేశాలకు చెందిన నావికాదళాలు మూడు రోజుల పాటు సంయుక్తంగా నిర్వహించే సిమ్‌బెక్స్-16 విన్యాసాలు అక్టోబర్ 31న ప్రారంభమయ్యాయి.

}ఇందుకుగాను సింగపూర్ నావికాదళానికి చెందిన యుద్ధనౌక కల్నల్ ఖో అక్ లీయోంగ్ ఆల్బర్ట్ నేతృత్వంలో 185 మంది స్క్వాడ్రాన్ సిబ్బందితో ఈ నౌక విశాఖకు చేరుకుంది.

}యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ), ఇంటిగ్రేడెట్ ఆపరేషన్స్ విత్ సర్ఫేస్, ఎయిర్ అండ్ సబ్‌సర్ఫేస్ ఫోర్సెస్, ఎయిర్ డిఫెన్స్ అండ్ సర్వేస్ ఎన్‌కౌంటర్ వంటి అంశాల్లో విన్యాసాలు జరిగాయి.

}భారత్ తరఫున ఐఎన్‌స్ రన్‌విజయ్, ఐఎన్‌స్ కమోర్త్ యుద్ధనౌకలు పాల్గొన్నాయి. 

మలబార్ విన్యాసాల్లో పాల్గొన్న భారత్, అమెరికా, జపాన్

}మలబార్ ఎక్సర్‌సైజ్ పేరుతో భారత్, అమెరికా, జపాన్‌లు జూన్ 10న నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించాయి.

}సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తూర్పు చైనా సముద్రంలోని వివాదాస్పద జలాలకు చేరువలో ఈ యుద్ధ విన్యాసాలు జరిగాయి.

}వీటిలో భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, సాత్పుర, శక్తి, కిర్చ్‌లతో పాటు మొత్తం 22 యుద్ధ నౌకలు, ఒక అణు జలాంతర్గామి, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. 

}1992 నుంచి భారత్, అమెరికాలు ఏటా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.

భారత్- అమెరికా రెడ్‌ఫ్లాగ్ విన్యాసాలు

}భారత్-అమెరికా వాయు సేనల రెడ్‌ఫ్లాగ్ విన్యాసాలు అమెరికాలోని అలస్కాలో మే 13న ముగిశాయి.

}నాలుగు వారాల పాటు సాగిన ఈ విన్యాసాల్లో భారత్‌కు చెందిన 10 యుద్ధ విమానాలు, 170 మంది సిబ్బంది పాల్గొన్నారు.

భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు

}భారత్-చైనా దేశాలు లడఖ్‌లో వ్యూహాత్మకంగా సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.

}వీటికి ‘సినో-ఇండియా కో-ఆపరేషన్ 2016’ అని పేరు పెట్టారు.

}చుసుల్-మొల్డో ప్రాంతంలో ఇరు దేశాల సరిహద్దు భద్రతాదళాలు సంయుక్తంగా విన్యాసాలను చేపట్టాయి.

}ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య విశ్వాసాన్ని పంచి సరిహద్లుల్లో శాంతి సుస్థిరతను కాపాడే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు



No comments:

Post a Comment