Saturday, February 4, 2017

ముఖ్యమైన కోర్టు తీర్పులు

  

సినిమా థియేటర్లలో ‘జనగణమన’ తప్పనిసరి

}ప్రజల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెంపొందించేందుకు సినిమా హాళ్లలో జాతీయ గీతం ‘జనగణమన’ను తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు నవంబర్ 30న ఆదేశాలు జారీ చేసింది

త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం: అలహాబాద్ హైకోర్టు

}ముస్లిం మహిళల హక్కులను కాలరాసే ట్రిపుల్ తలాక్ క్రూరమైనదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

}తక్షణ విడాకులైన ‘ట్రిపుల్ తలాక్’ ఒక దేశంగా భారత్ ఉండకుండా అడ్డుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది.

}ఏ సామాజిక వర్గానికి చెందిన పర్సనల్ లా అయినా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అతీతం కాదని చెప్పింది.

}యూపీకి చెందిన హినా(23), ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పు వెలువరిచింది. 

సింగూరు భూమి రైతులకిచ్చేయండి: సుప్రీంకోర్టు

}పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు భూసేకరణను సుప్రీంకోర్టు ఆగస్టు 31న కొట్టేసింది.

}గతంలో రైతులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని వెనక్కి తీసుకోరాదని, పదేళ్లపాటు రైతులు భూమికి దూరంగా ఉన్నందున ఆ మొత్తం రైతులకే చెందుతుందని తీర్పు చెప్పింది. 

}టాటా సంస్థ నానో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం పదేళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూరులో భూసేకరణ చేసింది.

ఢిల్లీపై పాలనాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కే

}రాజ్యాంగాన్ని అనుసరించి ఢిల్లీ.. కేంద్ర పాలిత ప్రాంతం గానే కొనసాగుతుందని, లెఫ్టినెంట్ గవర్నరే (ఎల్‌జీ) దానికి పాలనాధిపతి అని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 4న స్పష్టం చేసింది.

}ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకు ఎల్‌జీ పనిచేయాల్సిన అవసరం లేదని, ఆయన అనుమతి లేకుండా ప్రభుత్వ నోటిఫికేషన్ల జారీ అక్రమమని పేర్కొంది.

}దేశ రాజధాని ప్రాంతం (ఎస్‌సీటీ) పాలనా వ్యవహారాల్లో అధికారాలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 

తెలుగు ప్రాచీన భాషే: మద్రాస్ హైకోర్టు

}తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని మద్రాసు హైకోర్టు ఆగస్టు 8న తీర్పు చెప్పింది.

}తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా భాషలకు కేంద్రం కల్పించిన ప్రాచీన హోదా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన ఆర్ గాంధీ అనే సీనియర్ న్యాయవాది మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.

}రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాకరణం, సాహిత్యపు విలువలు.. వీటిల్లో ఏ ఒక్క అర్హతా లేని భాషలకు కేంద్రం ఇష్టారాజ్యంగా ప్రాచీన హోదా కల్పించిందని, దీనిని రద్దుచేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

స్వలింగ సంపర్కులు మూడో లింగ పరిధిలోకి రారన్న సుప్రీంకోర్టు

}స్వలింగ సంపర్కులను మూడో లింగ (థర్డ్ జెండర్) వ్యక్తులుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు జూన్ 30న స్పష్టం చేసింది.

}ఈ అంశంపై విచారణ నిర్వహించిన కోర్టు 2014లో (సుప్రీంకోర్టు) ఇచ్చిన తీర్పు ప్రకారం.. లింగమార్పిడి చేయించుకున్నవారు, హిజ్రాలు మాత్రమే మూడో లింగ వర్గానికి చెందుతారని, స్వలింగ సంపర్కులు ఆ పరిధిలోకి రారని పేర్కొంది. 


No comments:

Post a Comment