Saturday, February 4, 2017

GST- వస్తు సేవల పన్ను

     

జీఎస్‌టీ బిల్లుకి రాజ్యసభ ఆమోదం

}వివిధ రకాల రాష్ట్ర, స్థానిక పన్నులను తొలగించి వాటి స్థానంలో దేశవ్యాప్తంగా ఏకైక ఏకీకృత పన్నుగా వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలన్న బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 3న ఆమోదం తెలిపింది.

}స్వాతంత్య్రానంతరం దేశంలో అత్యంత భారీ పన్ను సంస్కరణ ఇది.

}రాజ్యాంగం ప్రకారం.. ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు విధించేందుకు కేంద్రానికి, చిల్లర అమ్మకం పన్నులు వసూలు చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది.

}ఆ పన్నుల స్థానంలో ఏకీకృతమైన జీఎస్‌టీని అమలు చేయటానికి వీలు కల్పించేందుకు.. రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు - 2014ను పెద్దల సభ ఆమోదించింది.

}జీఎస్‌టీకి సంబంధించి పలు అంశాలపై నాటి, నేటి అధికార, విపక్షాల మధ్య విభేదాలతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక పన్ను సంస్కరణల బిల్లుకు.. అన్నా డీఎంకే మినహా కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ పెద్దల సభలో మద్దతు ప్రకటించాయి.

}అన్నా డీఎంకే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. జీఎస్‌టీ అమలుపై దాదాపు ఏడు గంటల పాటు చర్చించిన అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 203 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు

 జీఎస్‌టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

}వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లుకు ఉద్దేశించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది.

}బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 3న ఆమోదం తెలిపగా.. లోక్‌సభ ఆగస్టు 8న ఆమోదించింది.

}జీఎస్‌టీ బిల్లును తొలుత 2015 మే 6న లోక్‌సభ ఆమోదించింది.

}అయితే తాజాగా రాజ్యసభ బిల్లులో చేసిన సవరణలకు లోక్‌సభ ఆగస్టు 8న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

జీఎస్టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం

}వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అస్సాం అసెంబ్లీ ఆగస్టు 12న ఏకగ్రీవంగా ఆమోదించింది.

}దీంతో ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది.

}ఇటీవల జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రాల ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది.

}ఈ నేపథ్యంలో జీఎస్‌టీ సవరణ బిల్లును అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వకర్మ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

జీఎస్‌టీ పరిమితి 20 లక్షలు

}ఏడాదికి రూ.20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలు, వర్తకులకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని సెప్టెంబర్ 23న జరిగిన జీఎస్టీ మండలి (కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు) భేటీలో నిర్ణయించారు.

}ఈశాన్య రాష్ట్రాలతోపాటు పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాల్లో మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలుగా నిర్ణయించినట్లు జీఎస్టీ మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

}దీంతో పాటు ఏడాదికి రూ.1.5 కోట్ల లోపు ఆదాయమున్న సంస్థల వ్యవహారాలన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి.

}జీఎస్టీ కింద 90 రకాల వస్తువులు, సేవలకు మినహాయింపు ఇవ్వనున్నారు.

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

}2017 లో  అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) రాజ్యాంగ సవరణ(122)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు.

}రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లు అమోదం కోసం 17 రాష్ట్రాలకు పంపగా 16 రాష్ట్రాలు అమోదించాయి.

}బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా అస్సాం నిలవగా, ఒడిశా 16వ రాష్ట్రంగా నిలిచింది.

}వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను ఉద్దేశం



No comments:

Post a Comment