Saturday, February 4, 2017

ముఖ్యమైన రక్షణరంగ ప్రయోగాలు

    యాంటీ-ఎయిర్‌ఫీల్డ్ ఆయుధ పరీక్ష విజయవంతం

}న్‌వేలు, బంకర్లను ధ్వంసంచేసే సత్తా ఉన్న అత్యాధునిక ‘స్మార్ట్ యాంటీ-ఎయిర్‌ఫీల్డ్’ ఆయుధాన్ని రక్షణ, పరిశోధక అభివృద్ధి సంస్థ డిసెంబర్ 24న విజయవంతంగా పరీక్షించింది.

}చాందీపూర్- ఒడిశా మధ్య దీని ప్రయోగించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 120 కేజీల ఈ ఆయుధం 100 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

  అగ్ని-5 ప్రయోగం విజయవంతం

}అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి అగ్ని-5 ను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.

}ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిసెంబర్ 26 దీనిని పరీక్షించారు.

}అగ్ని-5 పరిధి 5-6 వేల కిలోమీటర్లు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసార్థమున్న ఈ క్షిపణి 1,500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు.

}తాజా ప్రయోగంతో ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి సామర్థ్యం ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌ల సరసన ఇండియా చేరింది

  యూఏవీ రుస్తుం-2 తొలి పరీక్షలు విజయవంతం

}దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ) రుస్తుం-2 (తపస్-201) తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండు టన్నుల బరువు ఉండే రుస్తోం మధ్యస్థ స్థాయి ఎత్తుల్లోని లక్ష్యాలపై దాడి చేయగలదు.

}దీనిని డీఆర్‌డీవో (బెంగళూరు), హెచ్‌ఏఎల్-బీఈఎల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

  పృథ్వీ-2 విజయవంతం

}దేశీయ పరిజ్ఞానంతో తయారై, అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ-2 క్షిపణిని ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది.

}ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడంతో పాటు 500-1000 కిలోల బరువున్న వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఇది డీఆర్‌డీవో ఆధ్వర్యంలో తయారైన తొలి క్షిపణి.

  యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై ప్రారంభం

}కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నైని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నవంబర్ 21న ముంబైలో ప్రారంభించారు.

}దీనిపై సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8 దీర్ఘ శ్రేణి క్షిపణులను మోహరించొచ్చు

   అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం

}స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆఫ్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశాలోని వీలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నవంబర్ 22న జరిపిన అగ్ని-I క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.

}ఈ మిస్సైల్ 500 కిలోల బరువు గల న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవుతో ఉన్న ఈ క్షిపణి దాదాపు 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది.

}రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఈ క్షిపణిని రూపొందించింది. అగ్ని-1ను చివరిసారిగా 2016 మార్చి 14న ఇదే వేదిక నుంచి విజయవంతంగా పరీక్షించారు 

 క్షిపణి విధ్వంసక నౌక ‘మోర్ముగావో’ ప్రారంభం

}పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘మోర్ముగావో’ను సెప్టెంబర్ 17న ప్రారంభించారు.

}ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) తయారు చేసిన ఈ నౌకను నావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా ప్రారంభించి అరేబియా సముద్రంలోకి జలప్రవేశం చేశారు.

}మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లను ప్రయోగించవచ్చు. ఇది 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

 ఇజ్రాయెల్-భారత్ ఎంఆర్-శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

}భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మీడియం రేంజ్ మిస్సైల్ (ఎంఆర్-శామ్)ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు.

}దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్‌కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి



No comments:

Post a Comment