Saturday, February 4, 2017

ఐక్యరాజ్యసమితి విశేషాలు

}ఐరాస సెక్రటరీ జనరల్‌గా గ్యుటెరస్ ప్రమాణస్వీకారం
ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గ్యుటెరస్ డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు.

}ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియనుంది.

}భద్రతామండలి సంస్కరణలకు జీ-4 డిమాండ్ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని జీ-4 దేశాలు (భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) డిమాండ్ చేశాయి.

}21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ వాస్తవికతల దృష్ట్యా.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి.. తాము న్యాయబద్ధమైన అభ్యర్థులమని పేర్కొన్నాయి.

}యునిసెఫ్ అంబాసిడర్‌గా ప్రియాంకయునిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ కొత్త ప్రచారకురాలిగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నియమితులయ్యారు.

}ఐక్యరాజ్యసమితిలో అంబేడ్కర్ జయంతి ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ (125వ) జయంతి వేడుకలను నిర్వహించారు.

}ఈ వేడుకల్లో ఐరాస అభివృద్ధి కార్యక్రమం నిర్వాహకురాలు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, ఐరాస లోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

}2030 అభివృద్ధి అజెండా సాధనకు, అంబేడ్కర్ ఆశయాల మేరకు ప్రపంచవ్యాప్తంగా పేద, బడుగు వర్గాల అభివృద్ధికి భారత్‌తో కలిసి కృషి చేస్తామని క్లార్క్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి ఆశయ సాధనకు అసమానతలపై పోరు అనే అంశంపై చర్చ జరిగింది.

          ఐరాస అత్యవసర నిధికి భారత్ ఆర్థిక సాయం

}ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి భారతదేశం 5 లక్షల అమెరికన్ డాలర్ల ఆర్థికసాయాన్ని ప్రకటించింది.

}డిసెంబర్ 14న జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత దౌత్యవేత్త అంజనీ కుమార్ 2016-17 సంవత్సరానికి భారత్ తరఫున ఈ సహాయాన్ని ప్రకటించారు.

}యూఎన్‌(UN)లో అత్యవసర నిధిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 60 లక్షల డాలర్లను అందించింది.



No comments:

Post a Comment