Saturday, February 4, 2017

బ్రిటన్ రిఫెరండం

}యురోపియన్ యూనియన్‌తో నాలుగున్నర దశాబ్దాల బంధాన్ని తెంచుకునేందుకే మెజారిటీ బ్రిటన్లు మొగ్గుచూపారు.

}జూన్ 23న జరిగిన రెఫరెండంలో 51.9 శాతం మంది బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం)కే మద్దతు తెలిపారు.

}ఈయూలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్.. ఈయూ నుంచి తప్పుకోనున్న రెండో దేశంగా (గ్రీన్‌లాండ్ తర్వాత) నిలిచింది.

}యూకే ఎన్నికల కమిషన్ చీఫ్ జెన్నీ వాట్సన్ ప్రతిష్ఠాత్మకమైన మాంచెస్టర్ టౌన్‌హాల్ నుంచి జూన్ 24న ఈ ఫలితాలను వెల్లడించారు. 

}దాదాపు 3.3 కోట్ల మంది బ్రిటన్లు (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జీబ్రాల్టర్) రెఫరెండంలో పాల్గొనగా 1.74 కోట్ల మంది (51.9 శాతం) విడిపోవాలని.. 1.61 కోట్ల మంది (48.1 శాతం) ఈయూతో కలిసుండాలని తమ నిర్ణయాన్ని తెలియజేశారు.

}బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య తేడా 12.69 లక్షలు మాత్రమే. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో ఎక్కువ మంది యురోపియన్ యూనియన్‌లోనే ఉండాలని తమ అభిప్రాయాన్ని తెలపగా.. ఉత్తర, మధ్య ఇంగ్లాండ్, వేల్స్, మెజారిటీ ఇంగ్లీష్ కౌంటీలు మాత్రం బ్రెగ్జిట్‌కే మొగ్గుచూపాయి.

No comments:

Post a Comment