Saturday, February 4, 2017

అమెరికా ఎన్నికలు

}అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ జాన్ ట్రంప్ ఘనవిజయం సాధించారు.

}నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్‌కు 305 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.

}పాపులర్ ఓట్లలో హిల్లరీ 47.7 శాతం (5,93,21,645), ట్రంప్ 47.5 శాతం (5,91,50,974) సాధించారు.

}ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ 2017, జనవరి 20న వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

}రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన 70 ఏళ్ల ట్రంప్ 18 నెలల కిందటే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 

}ఈ ఎన్నికల్లో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు విజయం సాధించారు.

}కమలా హ్యారిస్ (51):ఈమె రెండు సార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో అమెరికా సెనేట్‌కు ఎంపికయ్యారు.

}ప్రమీల జయపాల్: హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌‌సకు ఎంపికై న తొలి భారతీయ-అమెరికన్‌గా ప్రమీల (51) రికార్డు నెలకొల్పారు. సియాటెల్ నుంచి ఈమె ప్రతినిధుల సభకు ఎంపికయ్యారు. 

}రాజా కృష్ణమూర్తి: రాజా కృష్ణమూర్తి ప్రతినిధుల సభకు అర్హత సాధించారు. ఇల్లినాయిస్‌లోని 8వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి (42) 2000, 2004ల్లో ఒబామా యూఎస్ సెనేట్ ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

}రోహిత్ ఖన్నా: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన ఖన్నా (42) కాలిఫోర్నియాలోని 17వ డిస్ట్రిక్ట్ నుంచి హోండాపై విజయం సాధించారు.

}అమీ బెరా: డెమొక్రటిక్ పార్టీ తరపున సాక్రమెంటో కౌంటీ నుంచి బరిలో దిగిన అమీ బెరా విజయం సాధించారు. ఈమె 2012, 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.


దీంతో గతంలో మూడుసార్లు కాంగ్రెస్‌కు ఎంపికై న భారతీయుడు దలీప్ సింగ్ సౌంద్ రికార్డును బెరా సమం చేశారు. జిందాల్ కూడా 2004, 2006లో రెండుసార్లు లూసియానా గవర్నర్‌గా ఎంపికయ్యారు.


No comments:

Post a Comment