Saturday, February 4, 2017

వివిధ క్రీడలలో ముఖ్యమైన విజయాలు

వివిధ క్రీడలలో ముఖ్యమైన  విజయాలు

}ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలి చింది.

}డిసెంబర్ 23న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

}ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మూడో సీజన్ టైటిల్‌ను అట్లెటికో డి కోల్‌కతా రెండోసారి దక్కించుకుంది.

}డిసెంబర్ 18న కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీపై 4-3 తేడాతో పెనాల్టీ షూటౌట్ ద్వారా నెగ్గింది.

}చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్లు, రన్నరప్ కేరళకు రూ.4 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.

}జూనియర్ అండర్-21 హాకీ ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 18న లక్నోలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలిచింది.

}37 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఈవెంట్‌లో భారత జట్టు తొలిసారి 2001లో జూనియర్ ప్రపంచకప్‌ను సాధించింది. తాజా విజయంతో జర్మనీ తర్వాత ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది.

}ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత యువ క్రికెటర్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీసాధించాడు.

}చెన్నైలో డిసెంబర్ 19న జరిగిన టెస్టులో నాయర్ 381 బంతుల్లో 303 పరుగులు చేసి (32 ఫోర్లు, 4 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచాడు.

}తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలుచుకున్న తొలి భారత ఆటగాడు కూడా నాయరే. భారత్ నుంచి ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేశాడు.

}ఆసియా కప్ మహిళల టి-20 టోర్నమెంట్‌లో భారత్ వరుసగా ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది.

}బ్యాంకాక్‌లో డిసెంబర్ 4న జరిగిన ఫైనల్లో భారత్ 17 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది.

}2004లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి అన్నిసార్లు భారతే విజేతగా నిలిచింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన మిథాలీ రాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి

}ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) 2016 సంవత్సరానికి గాను ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

}దీంతో వరుసగా మూడు సార్లు చాంపియన్‌షిప్‌ను నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

}డిసెంబర్ 1న జరిగిన పోరులో కార్ల్‌సెన్, రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌పై ‘టైబ్రేకర్’లో విజయం సాధించాడు.

}కార్ల్‌సెన్ 2013, 2014లలో విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.

}రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన మహిళా బాక్సర్ సరితా దేవి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. 

}భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత పరుగులు (235) చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. తాజాగా ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించాడు.

}అంతకు ముందు ధోనీ ఆస్ట్రేలియాపై 2013లో 224 పరుగులు, 1999లో సచిన్ న్యూజిలాండ్‌పై 217 పరుగులు, 1978లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై 205 పరుగులు చేశారు.

}అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ 2016 టైటిల్ విజేతగా సింగపూర్ స్లామర్స్ నిలిచింది.

}డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సింగపూర్ స్లామర్స్ జట్టు 30-14తో ఇండియన్ ఏసెస్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

}గతేడాది కూడా ఇండియన్ ఏసెస్ జట్టుపైనే స్లామర్స్ విజయం సాధించింది. దీంతో సింగపూర్ స్లామర్స్ వరుసగా రెండు టైటిల్స్ నెగ్గగా ఇండియన్ ఏసెస్ రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది.

}భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్యూ స్పోర్త్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. బెంగళూరులో డిసెంబర్ 12న జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను ఓడించాడు. 


No comments:

Post a Comment