Saturday, February 4, 2017

స్పోర్ట్స్ అవార్డ్స్-2016

            స్పోర్ట్స్ అవార్డ్స్

}రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్-2016 ను 

      1)పి.వి.సింధు(బాడ్మింటన్)     

      2)సాక్షిమాలిక్ (వ్రెస్లింగ్) 

      3)దీప కర్మాకర్ (జిమ్నాస్టిక్స్) 

      4) జితు రాయ్ (షూటింగ్) లకు ప్రదానం చేసారు. 

      ఇది క్రీడలలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు.

}బెస్ట్ ఫుట్ బాల్ ప్లేయర్ ఫర్ 2016 ను క్రిస్టియానో డోనాల్డో గెలుపొందాడు, ఇతను పోర్చుగల్ దేశానికీ చెందినవాడు.

}ప్రపంచ ఉత్తమ అథ్లెట్ అవార్డును పురుషుల విభాగంలో  ఆరోసారి ఉసేన్ బోల్ట్(జమైకా) గెలుపొందాడు. ఇంతకు ముందు ఇతను 2008,2009,2011,2012,2013 సంవత్సరంలలో గెలుపొందాడు.

}మహిళా విభాగంలో ఇథియోపియా కు చెందిన మహిళా అథ్లెట్ అల్మజ్ అయాన(almaz ayana) గెలుపొందింది.

               ఐసీసీ మేటి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్

}2016 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న దుబాయ్‌లో ప్రకటించింది.

}ఇందులో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఏడాది ఐసీసీ మేటి క్రికెటర్, ఐసీసీ మేటి టెస్ట్ క్రికెటర్ అవార్డులను దక్కించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (2004) తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు.

}మేటి క్రికెటర్‌కు ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ని రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు.గతంలో భారత్ నుంచి రాహుల్ ద్రావిడ్ (2004), సచిన్ (2010) మాత్రమే ఈ ట్రోఫీని అందుకున్నారు.

}ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రవిచంద్రన్ అశ్విన్

}వన్డే క్రికెటర్: క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా)

}మహిళల వన్డే క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)

}మహిళల టీ20 క్రికెటర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)

}టీ20 ఉత్తమ ప్రదర్శన: కార్లోస్ బ్రాత్‌వెట్ (10 బంతుల్లో 34 నాటౌట్)

}వర్ధమాన క్రికెటర్: ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)

  అంపైర్ :  మరాయిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా).

}బ్రిటన్ టెన్నిస్ స్టార్ అండీ ముర్రే 2016కు గాను బీబీసీ ఉత్తమ క్రీడాకారుడు (స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్) అవార్డును గెలుచుకున్నాడు. 

}ముర్రే 2016లో మొదటి ర్యాంక్‌ను అందుకోవడమే కాకుండా ఒలింపిక్ స్వర్ణం కూడా సాధించాడు.

}2013, 15లో కూడా అవార్డును పొందిన ముర్రే మూడోసారి దీనిని అందుకున్నాడు. 

}ఈ అవార్డుల్లో స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్స్ కు జీవితకాల సాఫల్య పురస్కారం, అమెరికా జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ కు విదేశీ ఉత్తమ క్రీడాకారిణి అవార్డులు లభించాయి. 

}2016లో నిలకడగా రాణించినందుకు గాను పి.వి.సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ‘మోస్ట్ ఇంప్రూవ్ద్  ప్లేయర్’ (చాలా మెరుగైన క్రీడాకారిణి) అవార్డు లభించింది.

}భారత మాజీ క్రికెటర్ సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కు రేమండ్ క్రాస్‌వర్డ్ పాపులర్ అవార్డు దక్కింది.

}అత్యధిక అమ్మకాలతో 2016లో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ పుస్తకం తాజాగా పాపులర్ అవార్డుకు ఎంపికైంది


 

No comments:

Post a Comment