Saturday, February 4, 2017

భారతదేశంలో ముఖ్యమైన నియామకాలు

       బాధ్యతలు చేపట్టిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతులు

}భారత 27వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ స్థానంలో డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు స్వీకరించారు.

}అలాగే అనూప్ రాహా స్థానంలో వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ బిరేందర్ సింగ్ ధనోవా బాధ్యతలు స్వీకరించారు.

             నూతన సీజేఐగా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్

}ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పదవీకాలం 2017, జనవరి 3తో ముగియనుంది. 2017, జనవరి 4న జస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

}ఆయన ఈ పదవిలో దాదాపు 8 నెలల పాటు (ఆగస్టు 27, 2017 వరకు) కొనసాగుతారు.

}సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి సిక్కు వ్యక్తి జస్టిస్ ఖేహర్.

No comments:

Post a Comment